Sanatana Dharma.net

సుస్వాగతం! - సనాతన - ధర్మ

సనాతన

ఈ సనాతన ధర్మం గురించి ఇక్కడ తెలుసుకొండి, తెలుసుకుని జన్మతరింప చేసుకొండి.

వసుధైవ కుటుంబకం "లోకా సమస్తా సుఖినోభవంతు"

"ధర్మో రక్షతి రక్షితః"

Note: For Languages prefarances, please add your Preferred language from your browser setttings.



సనాతన ధర్మం అంటే?

సనాతనధర్మం ఇవి రెండుపదాలు

సనాతన = శాస్వతమైనది

ధర్మం = బాధ్యతతొ కూడిన నీతి,నియమాలు

సనాతనధర్మం అంటే "మతం" మాత్రమే కాదు, సనాతనధర్మం మానవాలికి ఒక జీవన దిశానిర్ధేశం. దీని నిగూడార్ధం "ధర్మం శాస్వతమైనది" అని అర్ధం . దీనికి ఆది అంతం లేదు కాబట్టి సనాతన (శాస్వతమైనది)అని పిలుస్తారు.

సనాతనధర్మం గొప్పతనం :

ఇది ఆత్మ యొక్క ఆధ్యాత్మిక గుర్తింపు, మంచి, దయ, మరియు ఆత్మనిగ్రహం మొదలగు సద్గుణాలను పాటిస్తుంది. సనాతన ధర్మం - ఇది హిందూ ధర్మానికి ఒక దిక్సూచి వంటిది. సనాతనధర్మం ఎప్పటకీ నాశనం కానిది శాస్వతమైనది. ఇది నిన్ను సన్మార్గం మరియు సత్కర్మల ద్వారా నీ ఆత్మ శక్తిని మేల్కొలిపి, మోక్షానికి దారి చూపుతుంది.

ఎందుకు సనాతనధర్మం ?


ఆత్మజ్ఞానం: "నేను ఎవరు?" అనే ప్రశ్నతో మొదలుపెట్టి, మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తించి మోక్షం వైపు ప్రయాణించడానికి ఇది దారి చూపుతుంది

మానసిక వికాసం: ద్యానం మరియు యోగా మరియు సత్కర్మల, సహ్రుదయంతొ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి

క్రమశిక్షణతొ జీవనశైలి ఇది కేవలం పూజలకే పరిమితం కాదు, ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఒక మనిషి ఎలా ఉండాలో నేర్పే జీవన విధానం.

సమాజ శ్రేయస్సు (ధర్మం): "లోకా సమస్తా సుఖినో భవంతు" అనే సూత్రంతో, కేవలం మనమే కాకుండా సమాజం మొత్తం బాగుండాలనే విశాల దృక్పథాన్ని ఇది కలిగిస్తుంది.

శాస్త్రీయత: మన ఆచారాల వెనుక లోతైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం తినే ఆహారం, పాటించే శుభ్రత, మరియు ప్రకృతిని (చెట్లు, నదులు) గౌరవించడం వెనుక పర్యావరణ పరిరక్షణ దాగి ఉంది. న్యూటన్ మూడవ గమన నియమం దీనికి సరిపోలుతుంది. "ప్రతీ చర్యకు దానికి సమానమైన మరియు వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది."

కర్మ సిద్ధాంతం: సత్కర్మలకే మనకు ఫలితం లభిస్తుందని నమ్మడం వల్ల, మనిషి తప్పుడు పనులు చేయడానికి వెనుకాడి, మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాడు. నిజానికి దుష్కర్మ చేస్తే దాని ఫలితం దుష్కర్మ చేసిన వాళ్ళుకు చెడు జరగటం సర్వ సాదరణం ఇది కొటానుకొట్లు మంది దుష్కర్మ ఫలిత బాధలను ఎదుర్కొన్నారు.. "అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్"

శ్రేష్ఠ-జీవితం: మనం ఎలా ఉంటే జీవితం హాయిగా సాగిపోతుందో, అలా ఎలా ఉండాలో ముందుగానే తెలియజేసేదే సనాతన ధర్మం. దీనికి చిన్న ఉదాహరణ: ఒక మంచి పని మంచిగా జరగాలి అంటే దానికి ముహూర్త శాస్త్రం ప్రకారం కాల నిర్ణయం చేసి ఆసమయానికి ఆ పని చేస్తే ఆ పని ఫలప్రదంగా సంపూర్ణమౌతుంది.