Sanatana Dharma.net

సుస్వాగతం! - సనాతన - ధర్మ

Discover Sanatana Dharma, the eternal and universal way of life.
Master the timeless principles of Dharma, Karma, and Yoga.
Start your journey to self-realization today.

సనాతన

ఈ సనాతన ధర్మం గురించి ఇక్కడ తెలుసుకొండి, తెలుసుకుని జన్మతరింప చేసుకొండి.

వసుధైవ కుటుంబకం "లోకా సమస్తా సుఖినోభవంతు"

"ధర్మో రక్షతి రక్షితః"

Note: For language preferences, please add your preferred language in your browser settings. Additionally, mobile users should set their browser to Desktop Mode for the best viewing experience.



సనాతన ధర్మం అంటే?

సనాతనధర్మం అనేది రెండు పదాల కలయిక:

  • సనాతన = శాశ్వతమైనది
  • ధర్మం = బాధ్యతతో కూడిన నీతి, నియమాలు

సనాతనధర్మం అంటే కేవలం ఒక "మతం" మాత్రమే కాదు, ఇది మానవాళికి ఒక జీవన దిశానిర్దేశం. దీని నిగూడార్థం "ధర్మం శాశ్వతమైనది". దీనికి ఆది అంతం లేదు కాబట్టి సనాతన అని పిలుస్తారు.

సనాతనధర్మం గొప్పతనం:

ఇది ఆత్మ యొక్క ఆధ్యాత్మిక గుర్తింపును, దయను మరియు ఆత్మనిగ్రహం వంటి సద్గుణాలను బోధిస్తుంది. ఇది హిందూ ధర్మానికి ఒక దిక్సూచి వంటిది. సనాతనధర్మం ఎప్పటికీ నాశనం కానిది, శాశ్వతమైనది. ఇది సన్మార్గం మరియు సత్కర్మల ద్వారా మోక్షానికి దారి చూపుతుంది.

ఎందుకు సనాతనధర్మం?

ఆత్మజ్ఞానం: "నేను ఎవరు?" అనే ప్రశ్నతో మొదలుపెట్టి, మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తించడానికి ఇది దారి చూపుతుంది.

మానసిక వికాసం: ధ్యానం, యోగా మరియు సత్కర్మల ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది.

క్రమశిక్షణతో కూడిన జీవనశైలి: ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒక మనిషి ఎలా జీవించాలో నేర్పే సంపూర్ణ జీవన విధానం ఇది.

సమాజ శ్రేయస్సు: "లోకా సమస్తా సుఖినో భవంతు" అనే సూత్రంతో అందరూ బాగుండాలనే విశాల దృక్పథాన్ని కలిగిస్తుంది.

శాస్త్రీయత: మన ఆచారాల వెనుక లోతైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, న్యూటన్ మూడవ గమన నియమం (ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది) మన కర్మ సిద్ధాంతానికి సరిపోలుతుంది.

కర్మ సిద్ధాంతం: సత్కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్మడం వల్ల మనిషి మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాడు.


సనాతనధర్మం మూలాధారాలు:

ధర్మం (Dharma): బాధ్యత మరియు నీతిని అనుసరించడం.

కర్మ (Karma): మనం చేసే పనులు మరియు వాటి ఫలితాలు.

యోగ (Yoga): శరీరం, మనస్సు మరియు ఆత్మను అనుసంధానించే సాధన.

మోక్షం (Moksha): జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది పరమాత్మలో ఐక్యం అవ్వడం.


హిందూధర్మం & సనాతనధర్మం మధ్య తేడా:

సనాతన ధర్మం అనేది అసలు పేరు కాగా, లోక వ్యవహారంలో మనం వాడుతున్న పేరు హిందూ ధర్మం.

సనాతన ధర్మం: ఇది సృష్టి ఆరంభం నుండి ఉందని నమ్ముతారు. దీనికి స్థాపకుడు అంటూ లేరు. ఇది విశ్వవ్యాప్తమైన నియమాలతో కూడుకున్న ఆధ్యాత్మిక లోతును కలిగి ఉంటుంది.

హిందూ ధర్మం: ఆధునిక కాలంలో ఒక వ్యవస్థగా ఏర్పడిన రూపం. ఇది సామాజిక చట్టాలు, పండుగలు మరియు వివిధ ఆచార వ్యవహారాలను కలిగి ఉంటుంది.

.

.

.

.